న్యూఢిల్లీ: సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దల్జిత్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కాగా, బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్, డిప్యూటీ స్పెషల్ డీజీ (వెస్ట్) ఖురానియాలను విధుల నుంచి తొలగిస్తూ కేంద్రం శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.