Vagus Nerve | న్యూఢిల్లీ: తీవ్ర నైరాశ్యం, మానసిక ఒత్తిళ్లతో బాధపడేవారి శీర్ష నాడి (వేగస్ నెర్వ్)ని ఉత్తేజితం చేయడం వల్ల వారు ఆ బాధల నుంచి ఉపశమనం పొందుతారని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘బ్రెయిన్ స్టిమ్యులేషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక ప్రకారంశీర్ష నాడిని ఉత్తేజపరచినపుడు ఒత్తిడి, నైరాశ్యం నుంచి ఉపశమనం పొందవచ్చు.
అమెరికాలోని 84 ప్రాంతాలకు చెందిన 500 మందిపై ఈ అధ్యయనం జరిగింది. వీరి ఛాతీ లోపలి భాగంలో పేస్‌మేకర్ వంటి డివైస్‌ను అమర్చి పరీక్షించగా వీరిలో నైరాశ్యం లక్షణాలు బాగా తగ్గాయి. అయితే ఈ విధానం ఖరీదు కాబట్టి ఇప్పట్లో ఈ విధానం ప్రజలకు అందుబాటులోకి రాకపోవచ్చు.