న్యూఢిల్లీ: హరేరామ హరేకృష్ణ కీర్తనలకు స్పైడర్‌మ్యాన్(Spider Man dance) స్టెప్పులేశాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అట్లాంటా సంకీర్తన భక్తులు టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శన ఇస్తున్న సమయంలో.. సడెన్‌గా ఓ వ్యక్తి స్పైడర్‌మ్యాన్ డ్రెస్సులో వచ్చి డ్యాన్స్ చేశాడు. దోల్ బీట్లకు తగినట్లు ఆ స్పైడర్‌మ్యాన్ మూవ్స్ ఇచ్చాడు. స్పైడర్మాన్ చేరికతో స్థానిక భక్తులు మరింత ఉత్సాహాంతో చిందేశారు. అక్కడ ఉన్న జనం కూడా ఆ ఈవెంట్‌ను చూసి థ్రిల్ అయ్యారు. ఆ వీడియోకు సుమారు 10 లక్షల వ్యూస్ వచ్చాయి.
Video of ‘Spider Man’ dancing with Sankirtan devotees at Times Square is going viral. #Viralvideo pic.twitter.com/JyNLYNkHGH
— Zaitra (@Zaitra6) November 17, 2023