న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను విమానం దింపి, మరో విమానంలో తరలించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.
సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉన్నది. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ స్తంభాన్ని తాకడంతో దెబ్బతిన్నది. దీంతో వెంటనే ప్రయాణికులను అందులో నుంచి దింపి.. మరో ప్రత్యామ్నాయ విమానంలో జమ్మూకు తరలించినట్లు స్పైస్సెట్ ప్రతినిధి వివరించారు.