Sperm Quality | న్యూఢిల్లీ, మార్చి 5 : వీర్య కణాల నాణ్యత, దీర్ఘాయువుకు మధ్య సంబంధం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. నాణ్యమైన, చురుకైన వీర్య కణాలున్న వ్యక్తులు మూడేండ్లు ఎక్కువ జీవిస్తారని పరిశోధకులు గుర్తించారు. కోపెన్హెగెన్ యూనివర్సిటీ (డెన్మార్క్) దవాఖాన సైంటిస్టులు 50 ఏండ్లుగా 78 వేల మంది పురుషులపై అధ్యయనం జరిపారు. ‘శుక్ర కణాల సంఖ్య 120 మిలియన్ల (ప్రతి మిల్లీలీటరుకు) కంటే ఎక్కువ ఉన్న పురుషులు.. శుక్ర కణాలు 5 మిలియన్లు ఉన్న పురుషుల కంటే 2.7 సంవత్సరాలు ఎక్కువకాలం జీవించారు’ అని పరిశోధకురాలు లార్కే ప్రిస్కో ర్న్ చెప్పారు. వీర్య కణాల చలనశీలత తక్కువ ఉన్న వ్యక్తి 77.6 సంవత్సరాల వరకు, అధిక చలనశీలత ఉన్న వ్యక్తి 80.3 సంవత్సరాల వరకు జీవించవచ్చునని తెలిపారు.