చండీగఢ్: ఒక చోట పార్క్ చేసిన వాహనాన్ని డ్రైవర్ స్టార్ట్ చేశాడు. అయితే దానిపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ముందున్న మెడికల్ స్టోర్, టీ షాప్‌లోకి ఆ వాహనం దూసుకెళ్లింది. (SUV Rams Into Medical Store, Tea Shop) ఈ సంఘటనలో ఇద్దరు మరణించారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని పంచకులలో ఈ సంఘటన జరిగింది. గురువారం పాత పంచకులలోని మాజ్రీ చౌక్ సమీపంలో ఎస్యూవీ వాహనం పార్క్ చేసి ఉంది. డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేయగా అది అదుపుతప్పింది. ఎదురుగా పక్కపక్కనే ఉన్న టీ స్టాల్, మెడికల్ స్టోర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఆ రెండు షాపులు ధ్వంసమయ్యాయి. వాహనం డ్రైవర్, అందులో ఉన్న మరో వ్యక్తి అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులను 86 ఏళ్ల దౌలత్ రామ్, 18 ఏళ్ల నవజోత్గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని నలాగఢ్కు చెందిన నవజోత్, తన కుటుంబంతో కలిసి తీర్థయాత్ర కోసం కురుక్షేత్రకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో పంచకుల వద్ద టీ తాగేందుకు ఆ స్టాల్ వద్ద ఉన్న అతడికిపైకి వాహనం దూసుకెళ్లడంతో చనిపోయాడు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వాహనం డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన షాకింగ్ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
🔴 #BREAKING : High speed car rammed into shops in Panchkula, two people including the car driver died in the #Accident #Panchkula #Car #BreakingNews #Breaking pic.twitter.com/pXgLLBOjG6
— Indian Observer (@ag_Journalist) March 28, 2025
Speeding Mahindra TUV 300 gone inside ‘Medical Shop, Sanjay Medicos’.
Other day Theatre Parking Accident by 21 year old.@ChristinMP_ @DriveSmart_IN @dabir @skr77s @adjust_not @kirankumargoli @abhi_kulkarni85 @Nik_blr @ameyapc
Panchkula, Haryana
1/1
pic.twitter.com/UgeJVqeTHw— Dave (Road Safety: City & Highways) (@motordave2) March 27, 2025