డెహ్రాడూన్: కొందరు విద్యార్థులు రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారు. ఒక కారు వేగంగా వారి మీదకు దూసుకెళ్లింది. (Car Runs Over School Students) ఈ సంఘటనలో ఏడుగురు స్కూల్ బాలికలతో సహా 9 మంది గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 23న వికాస్‌నగర్-సెలాకి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులు స్కూల్ తర్వాత తమ ఇళ్లకు నడిచి వెళ్తున్నారు. డెహ్రాడూన్-పావోంటా జాతీయ రహదారి నుంచి నిగమ్ రోడ్లోకి ఒక కారు వేగంగా వచ్చింది. నడిచి వెళ్తున్న స్కూల్ బాలికలపైకి అది దూసుకెళ్లింది. ఒక బాలిక గాలిలోకి ఎగిరిపడింది. అదుపుతప్పిన ఆ కారు మరో మూడు వాహనాలను కూడా ధ్వంసం చేసింది.
కాగా, ఈ ప్రమాదంలో ఏడుగురు స్కూల్ బాలికలు, కారు డ్రైవర్, మరో బాలిక తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तराखंड में हवा में उड़ती गाड़ियों का आतंक कब खत्म होगा? सड़क सुरक्षा के दहशतगर्द लगातार बढ़ते जा रहे हैं। देहरादून में स्कूल से घर जा रही छात्राओं को एक आल्टो कार ने रौंद दिया। पुलिस ने मामला दर्ज किया है। CCTV आया सामने। 8 लोग अस्पताल में भर्ती
Video: Teena Sahu pic.twitter.com/LHuXkzJHih
— Ankit Sharma (@ankitsharmauk) April 24, 2025