న్యూఢిల్లీ : మన పాలపుంత నుంచి కొన్ని నక్షత్రాలు విడిపోయి, బయటకు పోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అటువంటి నక్షత్రాలు అనిశ్చిత స్థితిలో ప్రయాణిస్తున్నట్లు గమనించారు. గెలాక్సీ రొటేషన్‌ను నక్షత్రాల జనరల్ వెలాసిటీ డిస్పెర్షన్ ప్రతిబింబిస్తుంది. గెలాక్సీ రొటేషన్ నుంచి నక్షత్రం పక్కదారి పడితే, దానిని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతారు.
గెలాక్సీ కన్నా భిన్నమైన వేగంతో కదులుతున్న నక్షత్రాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. గెలాక్సీ నుంచి బయటకు వెళ్లే ఇటువంటి నక్షత్రాలను రోగ్ స్టార్స్ అంటారు. ఇప్పటి వరకు దాదాపు 1 కోటి నక్షత్రాలు ఈ విధంగా బయటకు పోయినట్లు అంచనా.