‘నథింగ్’పై భగ్గుమన్న దక్షిణాది
- ఫోన్ల సంస్థ వ్యాఖ్యలపై వివాదం!
- ట్విట్టర్లో హోరెత్తిన #డియర్నథింగ్
న్యూఢిల్లీ, జూలై 13: ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సొంతంగా ప్రారంభించిన నథింగ్ స్మార్ట్ఫోన్ వివాదంలో నిలిచింది. ఈ ఫోన్ను బాయ్కాట్ చేయాలని దక్షిణ భారతదేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ట్విట్టర్లోనైతే #డియర్నథింగ్ అన్న హ్యాష్ట్యాగ్ టాప్ ట్రెండింగ్లో నిలిచింది. వివరాల్లోకెళితే.. నథింగ్ సంస్థ మంగళవారం ఫోన్ (1)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ రివ్యూను ఓ తెలుగు టెక్ యూట్యూబ్ క్రియేటర్ యూట్యూబ్లో విడుదల చేశాడు. ఆ వీడియోలో.. ఫోన్ను అన్బాక్సింగ్ చేసి చూడగా.. హాయ్! దిస్ డివైజ్ ఈజ్ నాట్ ఫర్ సౌతిండియన్ పీపుల్ అని ఓ కాగితంపై రాసి ఉంది.
ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు నథింగ్ ఫోన్ (1) రివ్యూ ఇవ్వలేదని విమర్శిస్తూ వీడియోను తయారుచేశాడు. రివ్యూ యూనిట్లు ఇవ్వటం కంపెనీ బాధ్యత అని గుర్తు చేస్తూ వీడియోను ముగిస్తాడు. అతనితో పాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్లు కూడా ఇలాగే వీడియోలు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో, కొనుగోలుదారులు కూడా.. #బాయ్కాట్నథింగ్ #డియర్నథింగ్..అంటూ కామెంట్లు చేస్తున్నారు. వివాదంపై సంస్థ ఇంకా స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

