న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్‌ను కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది. 1987 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు క్యాడర్ అధికారి సోమనాథన్ ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు. రాజీవ్ గౌబా స్థానంలో క్యాబినెట్ కార్యదర్శిగా నియమితులైన ఆయన రెండేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. సోమనాథన్ 1987లో సివిల్స్‌లో 2వ ర్యాంకు సాధించారు. ఉత్తమ ప్రొబెషనరీ ఐఏఎస్‌గా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఇంతకు ముందు పీఎంవోలో అదనపు కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌గా పని చేశారు.