న్యూఢిల్లీ: సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చగలిగే పెయింట్‌ను తయారు చేసేందుకు మెర్సిడెస్-బెంజ్ కంపెనీ ప్రయత్నిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)లకు సోలార్ పెయింట్‌ను వేసినపుడు, ఆ వాహనాలు డ్రైవింగ్‌లో ఉన్నా, పార్కింగ్‌లో ఉన్నా, ఆ సోలార్ పెయింట్ సౌర శక్తిని సేకరించగలిగే విధంగా ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నది.
ఈ సోలార్ పెయింట్‌ను పలుచని, ఎలా కావాలంటే అలా సాగగలిగే ఫొటోవోల్టాయిక్ మెటీరియల్‌తో తయారు చేస్తున్నది. దీని బరువు చదరపు మీటరుకు 50 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇది 5 మైక్రోమీటర్ల దళసరిగా ఉంటుంది. ఓ సగటు మధ్యతరహా వాహనం సంవత్సరానికి 7,456 మైళ్ల దూరం ప్రయాణించడానికి అవసరమైన ఇంధనాన్ని సేకరించగలుగుతుందని ఈ కంపెనీ అంచనా వేస్తున్నది. అయితే, సూర్య కాంతి పడటాన్ని బట్టి ఈ ఇంధనం సేకరణ ఆధారపడి ఉంటుంది. ఈ పెయింట్ పర్యావరణ హితమైనదని ఈ కంపెనీ చెప్తున్నది.