కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 24 నుంచి 30వ తేదీలోగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. అంతేకాకుండా పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకొనేలా ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది.
ఈ ఏడాది డిసెంబర్లో గెహ్లాట్‌ను రాజ్యసభకు పంపి, ఆయన కుమారుడిని రాజస్థాన్ క్యాబినెట్లోకి తీసుకొనే సూచనలు ఉన్నట్టు సమాచారం. అయితే, పార్టీ సీనియర్ నేతలైన మల్లికార్జున్ ఖర్గే, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ తదితరులు గెహ్లాట్ సహచరులే. వీరంతా గెహ్లాట్ నాయకత్వంలో పనిచేస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది.