న్యూఢిల్లీ, మే 12: కీలకమైన ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంగీకరించడాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుప డుతూ మీరు ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థా? అని ఎద్దేవా చేశారు. చారిత్రాత్మకంగా కాంగ్రెస్కు ఎంతో బలం ఉన్న అమేథీలో పోటీ చేయడానికి భయపడిన రాహుల్.. ప్రధాని లాంటి వ్యక్తితో పోటీపడటంలో గల సామర్థ్యాన్ని ఆమె ప్రశ్నించారు. ఎంతో పటిష్ఠంగా భావించే రాజకోట లాంటి అమేథీలో పోటీ చేయడానికి ధైర్యం లేని వ్యక్తి మొదట తన ప్రగల్భాలు మానుకోవాలని,తర్వాతే ప్రధాని మోదీ స్థాయి వ్యక్తులతో చర్చకు దిగాలని అన్నారు.