Wife-Swapping | న్యూఢిల్లీ : ఓ భర్త తన భార్య పట్ల అనాగరికంగా ప్రవర్తించాడు. తన స్నేహితుడితో శృంగారం చేయాలని భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో గతేడాది చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన ఓ మహిళకు ముర్దాబాద్కు చెందిన వ్యక్తితో వివాహమైంది. నోయిడాలోని సెక్టార్ 137లో అత్తమామలతో కలిసి ఆమె ఉంటుంది. ఆమెను అత్తమామలు, భర్త కలిసి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు.
అయితే గతేడాది ఏప్రిల్ 18వ తేదీన భర్త.. తన భార్యను ఓ పార్టీ నిమిత్తం సెక్టార్ 75కి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులు వారి భార్యలు కూడా ఉన్నారు. ఇక తన భార్యకు భర్త బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో శృంగారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె కళ్ల ముందే.. స్నేహితుడి భార్యతో అతను శృంగారంలో మునిగి తేలాడు. ఈ విధంగా చేయకపోతే చంపేస్తానని బెదిరింపుకు గురి చేశాడు. లేదంటే తనను విడిచి వెళ్లాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ ఘటనతో విసిగిపోయిన భార్య ఈ ఏడాది జూన్ 23న పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా తన అత్త ఆగడాలను బాధితురాలు తన ఫిర్యాదులో వివరంగా పేర్కొంది. పెళ్లయినప్పటి నుంచి తన అత్తమామలు వేధిస్తున్నారని తెలిపింది. మాడ్రన్ లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవాలని అత్త వేధించినట్లు పేర్కొంది. అంతే కాదు.. తన భర్తతో కలయికను కూడా తన అత్తే డిసైడ్ చేసేదని, ఆ రోజుల్లోనే తాము కలిసేవాళ్లమని బాధితురాలు తెలిపింది.