శ్రీహరికోట : హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఈ నెలాఖరులో తాను ప్రయోగించే విక్రమ్-I రాకెట్లోని ప్రత్యేక పేలోడ్లలో భారత దేశ దిగ్గజ శాస్త్రవేత్తలైన సి.వి.రామన్, విక్రం సారాభాయ్, అబ్దుల్ కలాం బొమ్మలను ఉంచి రోదసిలోకి పంపనుంది.
దీని ద్వారా వారికి సముచిత నివాళి అర్పించనుంది. 18 క్యారెట్ల బంగారంతో చేసిన సూక్ష్మ రాకెట్లో ఈ ముగ్గురు శాస్త్రవేత్తల బొమ్మలను పొందుపరిచారు. ఈ బొమ్మలు బియ్యపు గింజ కంటే చిన్నవిగా ఉన్నాయి. వీటిని అజయ్ కుమార్ మట్టెవాడ రూపొందించారు.