గాల్లో తేలిపోయే ‘స్కై ట్రైన్’
- చైనాలో చవకైన హైటెక్ రైలు
- విద్యుత్తు అవసరం లేనే లేదు
- అయస్కాంత శక్తితో ప్రయాణం
- గరిష్టంగా గంటకు 50 మైళ్ల వేగం
- ఇప్పటికే ప్రయోగ దశ విజయవంతం
ట్రాక్‌కు టచ్ కాకుండా కొంచెం ఎత్తులో రయ్యిమంటూ దూసుకుపోయే మ్యాగ్లెవ్ రైళ్లకు (మ్యాగ్నెటిక్ లెవియేషన్ ట్రైన్స్) చైనా పెట్టింది పేరు. ఇప్పుడు ఆ డ్రాగన్ దేశం మరో సరికొత్త హైటెక్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నది. అవే ‘స్కై ట్రైన్స్’.
– నేషనల్ డెస్క్
ఏమిటీ స్కై ట్రైన్స్?
భూమికి 33 అడుగుల ఎత్తున ఉండే ట్రాక్. ఆ ట్రాక్‌ను ఆనుకొని తలకిందులుగా వేలాడుతూ.. అటాచ్ చేసిన రెండు బోగీలు. గంటకు 50 మైళ్ల గరిష్ట వేగంతో నడిచే రైలే.. ‘స్కై ట్రైన్’.
ఎలా నడుస్తాయి?
ట్రాక్‌పై ఏర్పాటు చేసిన శాశ్వత అయస్కాంత బార్లు సృష్టించే అయస్కాంత క్షేత్రం సాయంతో ఈ రైళ్లు నడుస్తాయి. తొలుత రైలు కదలడానికి స్వల్ప మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తారు. అనంతరం రైలు బోగీలపైన, ట్రాక్ కింద అమర్చిన దండ అయస్కాంత విజాతీ ధ్రువాల వికర్షణ సూత్రంతో ఈ రైలు కదులుతుంది.
ఉపయోగం ఏమిటి?
మ్యాగ్లెవ్ రైళ్ల కోసం ఎలక్ట్రో మ్యాగ్నెట్స్‌ను వినియోగిస్తారు. విద్యుత్తు అవసరం ఎక్కువ. రేడియేషన్ వెలువడటం వల్ల పర్యావరణానికి ప్రమాదకరం. అయితే, స్కై ట్రైన్ సిస్టమ్‌లో శాశ్వత అయస్కాంతాలను వినియోగించడం వల్ల విద్యుత్తు అవసరం ఉండదు. పర్యావరణానికి కూడా హితకారిణి. ట్రాక్ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. జియాంగ్జీ యూనివర్సిటీ పరిశోధకుల అంచనా ప్రకారం.. ఒక సబ్వే నిర్మాణానికి అయ్యే ఖర్చులో పదోవంతు నిధులతో ఈ ట్రాక్‌ను నిర్మించవచ్చు. స్కై ట్రైన్లో ఏకకాలంలో 88 మంది ప్రయాణించవచ్చు. దక్షిణ చైనాలోని జియాంగ్జీ ప్రావిన్సులో ఇప్పటికే ‘రెడ్ రైల్’ పేరిట 2,600 అడుగుల మేర ప్రయోగాత్మక ట్రాక్‌ను నిర్మించి విజయవంతంగా పరీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

