‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని...
– రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన
– 350 మంది రైతులకు మొక్కజొన్న విత్తనాల పంపిణీ
రుద్రంపూర్, నవంబర్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 350 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడె గణేష్ చౌహాన్ మాట్లాడుతూ.. రైతులు దేశానికి వెన్నెముక వంటివారని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సాంకేతిక సేవలు, సలహాలు, సూచనలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శిరివరపు లలితకుమారి మాట్లాడుతూ.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా వ్యవసాయ కుటుంబాల ఆదాయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడవచ్చని తెలిపారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. తద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించి అధిక ఆదాయం పొందవచ్చని వివరించారు.

‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ టి. భరత్ మాట్లాడుతూ.. కేంద్రం ద్వారా రైతులకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, సాంకేతిక సేవలు, విస్తరణ కార్యక్రమాలను వివరించారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగానికి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ప్రస్తావిస్తూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి టాగోర్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ జి. సునీల్ కుమార్, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సృజన్, డాక్టర్ శిరీష, డాక్టర్ రమేష్, బి. శివ, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు DHM-121 రకం మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సదస్సు ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ అనుకూల సాగు విధానాలు, సాగు ఖర్చుల తగ్గింపు, వ్యవసాయ ఆదాయ పెంపుపై రైతులకు అవగాహన కల్పించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

