Cardiac Arrest | గుండెపోటుతో ఆరేళ్ల బాలుడు మృతి
Cardiac Arrest | గుండెపోటు (Cardiac Arrest) మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుండెపోటుతో ఆరేళ్ల బాలుడు (Six Year Old Boy) మరణించడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
Cardiac Arrest | గుండెపోటు (Cardiac Arrest) మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యువకులు కూడా హార్ట్ఎటాక్తో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాతనే ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. కాగా, తాజాగా గుండెపోటుతో ఆరేళ్ల బాలుడు (Six Year Old Boy) మరణించడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి తనువు చాలించాడు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాహుల్ జైన్ అనే వ్యాపారవేత్తకు ఒక్కగానొక్క కొడుకు విహాన్ జైన్ (6) ఉన్నాడు. ఓ కార్పొరేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే, ఇటీవలే విహాన్ అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించడంతో కోలుకుని తిరిగి ఇంటికొచ్చా డు.
ఈ క్రమంలో ఫ్యామిలీ ఫంక్షన్ కోసం రాహుల్ తన కుటుంబంతో కలిసి గత వారం ఢిల్లీ వెళ్లాడు. అక్కడ విహాన్ మరోసారి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, వైద్య పరీక్షల్లో విహాన్‌కు మయోకార్డిటిస్ (Myocarditis) అనే అరుదైన వైరస్ సోకినట్లు తేలింది. ఈ వైరస్ గుండె కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కండరాల వాపునకు కారణమవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో గుండెకు రక్తం సరఫరాలో అవాంతరాలు ఎదురవుతాయని.. ఫలితంగా గుండె అకస్మాత్తుగా ఆగిపోతుందని వివరించారు.
Also Read..
Assaulted | కన్నకూతుళ్లపై లైంగిక వేధింపులు.. ప్రియుడికి సహకరించి కటకటాలపాలైన తల్లి
Malla Reddy | మహేశ్‌బాబు బిజినెస్‌మ్యాన్ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చా : మల్లారెడ్డి
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారు : మంత్రి మల్లారెడ్డి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

