Delhi-Zurich flight | టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్‌లో సమస్య.. చెలరేగిన మంటలు.. ఆరుగురికి గాయాలు
Delhi-Zurich flight | టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడం (Engine Failure) తో మంటలు చెలరేగిన ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ ఆరుగురిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
Delhi-Zurich flight : టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడం (Engine Failure) తో మంటలు చెలరేగిన ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ ఆరుగురిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్విస్ (SWISS) విమానం స్విట్జర్‌ల్యాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరడానికి సిద్ధమైంది. టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వెంటనే విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించేశారు. అత్యవసర సాధనాలను ఉపయోగించి ప్రయాణికులను కిందకు దించుతున్న సమయంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఘటన సమయంలో విమానంలో సిబ్బంది సహా 232 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేశామని చెప్పారు. త్వరలోనే మరో విమానంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

