లక్నో: అయోధ్య రామాలయ విరాళాల అవకతవకలకు సంబంధించిన వివాదంలో ‘సిట్’ యూపీ ప్రభుత్వానికి తన దర్యాప్తు నివేదికను సమర్పించింది. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆలయ ట్రస్ట్‌ను పునర్వ్యవస్థీకరించాలని, ఆలయానికి సీఈవోగా ఒక సీనియర్ అధికారిని నియమించాలని ‘సిట్’ తన నివేదికలో సిఫారసు చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం సమర్పించిన 150 పేజీల నివేదిక ప్రాథమికమైనదని, మరింత దర్యాప్తు కోసం కొంత సమయం కావాలని కోరింది.