పోరాటం ఇప్పుడే మొదలైంది.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకూ వెనక్కి తగ్గబోం
ఢిల్లీ పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం సీజేపీ సహ కన్వీనర్ ఆశుతోష్ రాంకా, మరో నేత సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ, తమ పోరాటం ఇప్పుడే మొదలైందని, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంత వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
- దేశ రాజధానిలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు
- సీఈసీని కాపాడేందుకు సొంత ప్రజలపైనే యుద్ధమా?
- కేంద్ర సర్కార్‌పై సీజేపీ ఫైర్
న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలను దేశవ్యాప్తం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతలు ప్రకటించారు. ఢిల్లీ పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం సీజేపీ సహ కన్వీనర్ ఆశుతోష్ రాంకా, మరో నేత సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ, తమ పోరాటం ఇప్పుడే మొదలైందని, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంత వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయని, ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని సీజేపీ ఆరోపించింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఢిల్లీలో అత్యవసర పరిస్థితులను తలపించే వాతావరణాన్ని సృష్టించిందని దాస్ విమర్శించారు.
ఎలాంటి అధికారిక నోటీసు లేకుండా తమను నిర్బంధించారని, తమ ఫోన్లు స్వాధీనం చేసుకుని, న్యాయవాదిని సంప్రదించేందుకు అనుమతించలేదని ఆరోపించారు. తమ ఫోన్లను హ్యాక్ చేసి, వాటిలో పత్రాలు లేదా ఇతర సమాచారాన్ని చొప్పించి, తర్వాత వాటిని సాక్ష్యాలుగా చూపిస్తారేమోనని అనుమానంగా ఉందని దాస్ పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు మోదీ, అమిత్ షా ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ‘గతంలో ఎమర్జెన్సీ గురించి విన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం. జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు మోదీ, షా ప్రయత్నిస్తున్నారు.
ఆయన్ను కాపాడేందుకు దేశ ప్రజలతోనే యుద్ధం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘శాంతి భద్రతలకు ఏడాది పాటు విఘాతం కలిగించకూడదని తమకు షరతు విధించారు. అయితే శాంతిభద్రతలకు విఘా తం కలిగిస్తున్నది నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్లేనని సీజేపీ నేతలు పేర్కొన్నారు. గత 72 గంటల్లో జరిగిన పరిణామాలు 1975-77 నాటి అత్యవసర పరిస్థితులను గుర్తుచేస్తున్నాయని రాంకా వ్యాఖ్యానించారు. ఈ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని, నిరసనల్లో పాల్గొనేందుకు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ వీధి పోలీసులను కలిసి జంతర్ మంతర్‌లో శాంతియుత నిరసన తెలిపేందుకు ఒక తేదీని అనుమతించాలని కోరతా మన్నారు.
నిరసనలు ఆపేందుకు బాండ్ రాయలేదు
ఢిల్లీ కోర్టు నుంచి బెయిల్‌పై విడుదలైన కొద్ది గంటల్లోనే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేత అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. తాము నిరననలు చేపట్టబోమని ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదని స్పష్టం చేస్తూ, మళ్లీ రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. సీజేపీ ఎప్పటికీ వెనక్కి తగ్గదని, భయపడబోదని చెబుతూ ఈ నెల 10న ప్రారంభమైన ఈ పోరాటం నిరంకుశత్వానికి ముగింపు పలికే ఆరంభమని పేర్కొన్నారు.
షరతులతో సీజేపీ నేతల విడుదల
నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తుండగా విమానంలోనే అరెస్ట్ చేసిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్దాస్లకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఏ పనీ చేయరాదన్న షరతుతో వారిని విడుదల చేసింది. వీరి ముగ్గురినీ ఆదివారం ఉదయం ఢిల్లీ కంటోన్మెంట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో జడ్జి వారికి 50 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

