న్యూఢిల్లీ/(స్పెషల్ టాస్క్ బ్యూరో), మే 22: మీ పేరు మీద సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఏం చేస్తారు? అధీకృత డీలర్‌కు మీ ఆధార్ కార్డు చూపించి సిమ్ తీసుకొంటారు కదూ. అయితే, ఒకే ఆధార్‌పై ఆ వ్యక్తికి తెలియకుండానే నకిలీ సిమ్‌కార్డులు తీసుకొంటున్న ఉదంతాలు ఇటీవల పెరిగిపోయాయి. దీంతో వీటికి చెక్ పెట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. కొత్త టెలికం నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి ఈ రూల్స్ అమలయ్యే అవకాశం ఉన్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ట్రాయ్ సిఫారసు చేసిన ఈ రూల్స్.. లోక్‌సభ ఎన్నికలు పూర్తై, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోగా అమల్లోకి తీసుకురావాలని డీవోటీ లక్ష్యంగా పెట్టుకొన్నది. శతాబ్దం నాటి టెలికం చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టెలికమ్యూనికేషన్స్ బిల్లు-2023ను పార్లమెంట్ గత ఏడాది డిసెంబర్ 20న ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమలు ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న టెలికం నిబంధనల్లో పలు కీలక మార్పులు రానున్నాయి.
శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులకు స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియలోనూ మార్పులు రానున్నాయి. వినియోగదారులకు డైరెక్ట్ రిటైల్ సర్వీసులు అందించే వాటి కంటే పాయింట్-పాయింట్ కనెక్షన్లు అందించే శాటిలైట్ కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయించాలని టెలికమ్యూనికేషన్స్ విభాగానికి ట్రాయ్ సూచించింది. శాటిలైట్ కంపెనీలు నేరుగా ప్రయోజనం పొందలేని, అలాగే టెలికం కంపెనీలకు ఎలాంటి సమస్యలకు తలెత్తకుండా ఉండేలా ఈ కేటాయింపు ప్రక్రియ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించాలంటే, కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా, సైబర్ మెసాలకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా దేశంలో ఇటీవల టెలికం కంపెనీలు దాదాపు 18 లక్షల మేర మొబైల్ నంబర్లను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.