Covaxin | కొవాగ్జిన్తోనూ సైడ్ ఎఫెక్ట్స్.. ఎక్కువమందిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు
కొవిషీల్డ్ తీసుకున్న వారిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళనలు కొనసాగుతుండగానే కొవాగ్జిన్‌పై జరిగిన ఓ అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
- 30 శాతం మందికి అనారోగ్య సమస్యలు
- 0.3 శాతం మందికి హార్ట్ స్ట్రోక్ ముప్పు
- బీహెచ్‌యూ అధ్యయనంలో వెల్లడి
Covaxin | న్యూఢిల్లీ, మే 16: కొవిషీల్డ్ తీసుకున్న వారిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళనలు కొనసాగుతుండగానే కొవాగ్జిన్‌పై జరిగిన ఓ అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌కు విరుగుడుగా భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ తీసుకున్న వారిలో దాదాపు 30 శాతం మంది వేర్వేరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారని బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి(బీహెచ్‌యూ) చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
కొవాగ్జిన్ తీసుకున్న 635 మంది యుక్తవయస్కులు, 291 మంది పెద్దవారిపై ఈ అధ్యయనం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ‘స్ప్రింగర్ నేచర్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కొవాగ్జిన్ అందుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు అనారోగ్య సమస్యలకు గురైనట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 304 మంది(47.9 శాతం) యుక్తవయస్కులు, 124 మంది(42.6 శాతం) మంది పెద్ద వయసు వారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారు.
యుక్తవయస్కుల్లో 10.5 శాతం మంది చర్మ సంబంధ రుగ్మతలను ఎదుర్కొన్నారు. 10.2 శాతం మంది సాధారణ అనారోగ్య సమస్యలు, 4.7 శాతం మంది నాడీవ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులకు గురయ్యారు. పెద్ద వారిలో 8.9 శాతం మంది సాధారణ రుగ్మతలు, 5.8 శాతం మంది మస్కులోస్కెలిటల్ సమస్యలు, 5.5 శాతం మంది నాడీ వ్యవస్థ సమస్యలను ఎదుర్కొన్నారు. 4.6 శాతం మంది మహిళలకు రుతుక్రమానికి సంబంధించి సమస్యలు వచ్చాయి. 2.7 శాతం మందిలో కంటి సమస్యలు, 0.6 శాతం మందిలో హైపోథైరాయిడిజం వచ్చినట్టు గుర్తించారు.
వెయ్యి మందిలో ముగ్గురికి స్ట్రోక్ ముప్పు
కొవాగ్జిన్ తీసుకున్న 0.3 శాతం మందిలో స్ట్రోక్, 0.1 శాతం మందిలో గులియన్-బారే సిండ్రోమ్ లాంటి తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్‌ను గుర్తించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో కంటే మూడు డోసులు తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత నాలుగింతలు, ఒక డోసు తీసుకున్న వారిలో రెండింతలు ఎక్కువ ఉన్నట్టు గుర్తించారు. కొవాగ్జిన్ తీసుకున్న 926 మందిపై ఈ అధ్యయనం జరగగా వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. కొవాగ్జిన్‌తో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ చాలాకాలం పాటు కొనసాగుతున్నందున ఆలస్యంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను అర్థం చేసుకునేందుకు వ్యాక్సిన్ తీసుకున్న వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం సూచించింది.
కొవాగ్జిన్ సురక్షితం: భారత్ బయోటెక్
ఈ అధ్యయనంపై కొవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పందించింది. కొవాగ్జిన్‌పై అనేక అధ్యయనాలు జరిగాయని, ఈ వివరాలన్నీ ప్రఖ్యాత జర్నళ్లలో ప్రచురితమయ్యాయని పేర్కొన్నది. అన్ని అధ్యయనాలూ కొవాగ్జిన్ సురక్షితమైనదని తేల్చాయని తెలిపింది. వాక్సిన్‌పై జరిగే అధ్యయనం ప్రభావవంతంగా, పూర్తి సమాచారంతో ఉండాలని, పరిశోధకులకు పక్షపాతం ఉండొద్దని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

