న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ క్రమంలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా బెయిల్ కోసం ఢిల్లీలోని సాకేత్ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. అఫ్తాబ్ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.
అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ (27) అనే యువతిని కొన్ని నెలల క్రితం అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి మెహ్రౌలీ ఏరియాలో వేర్వేరు ప్రాంతాల్లో పారేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్‌ను పోలీసులు గత నెల అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం నిందితుడు తీహార్ జైల్లో ఉన్నాడు. మృతురాలి దేహ భాగాలు మరికొన్ని లభ్యం కావాల్సిన ఉన్నందున నిందితుడి కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని గతంలో పోలీసులు కోర్టును కోరారు. దాంతో కోర్టు ఈ నెల 9న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఫ్తాబ్‌ను పొడిగించి అతని జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. ఈ క్రమంలోనే నిందితుడు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు.