లక్నో: ఇద్దరు వ్యక్తులు వేగంగా వెళ్తున్న ఆటోపై ప్రమాదకరంగా స్టంట్స్ చేశారు. (Shirtless Men Dance Atop Auto) చొక్కాలు తీసేసి డ్యాన్సులు చేశారు. ఒక వ్యక్తి ఆటో పట్టుకుని వేలాడగా, మరో వ్యక్తి ఆటోపై హంగామా చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక ఆటో వేగంగా వెళ్తున్నది. పెద్దగా మ్యూజిక్ పెట్టారు. చొక్కాలు విప్పేసిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. ఒక వ్యక్తి ఆటోను పట్టుకుని వేలాడగా మరో వ్యక్తి ఆటో టాప్‌పై స్టంట్స్ చేశాడు.
కాగా, ఆ రోడ్డులో వెళ్తున్న వాహనంలోని వ్యక్తి దీనిని రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో నంబర్ ఆధారంగా ఆ ఆటోను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
नोएडा-ग्रेटर नोएडा एक्सप्रेसवे पर पिंक ऑटो की छत पर अर्धनग्न युवकों ने किया खतरनाक स्टंट।
pic.twitter.com/hMrUZbZbsR— Greater Noida West (@GreaterNoidaW) April 1, 2025