న్యూఢిల్లీ : విమానంలో మహిళపై ఓ ప్రయాణీకుడు తప్పతాగి మూత్రం పోసిన ఘటన మరువక ముందే అర్ధనగ్నంగా ఉన్న ఓ వ్యక్తి సహ ప్రయాణీకుడి పట్ల విమానం లోపల అభ్యంతరకరంగా వ్యవహరించిన ఉదంతం వెలుగుచూసింది. బిమన్ బంగ్లాదేశ్ ఫ్లైట్ లోపల జరిగిన ఈ ఘటనను బిటాంకో బిశ్వాస్ ట్విట్టర్లో షేర్ చేశారు.
Another "Unruly Passenger" 👊
This time on a Biman Bangladesh Boeing 777 flight!🤦♂️ pic.twitter.com/vnpfe0t2pz— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023
ఈ క్లిప్‌లో షర్ట్ లేకుండా కనిపించిన ఓ వ్యక్తి సహ ప్రయాణీకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సహ ప్రయాణీకుడిపై దాడి చేస్తున్న అతడిని తోటి ప్రయాణీకులు వారించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో అనాగరిక ప్రయాణీకుడు..ఈసారి బిమన్ బంగ్లాదేశ్ బోయింగ్ 777 ఫైట్! అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్లిప్‌ను ఇప్పటివరకూ 1.1 లక్షల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు.
అసలు ఇలాంటి వ్యక్తులను విమనాల్లోకి రాకుండా శాశ్వతంగా అడ్డుకోవాలని పలువురు యూజర్లు రాసుకొచ్చారు. ఇలాంటి రౌడీ ప్యాసింజర్లు విమానాల్లో దురుసుగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు ఆందోళనకరంగా పెరిగిపోయాయని మరికొందరు వ్యాఖ్యానించారు.ఇలాంటి వారిని పసిగట్టేందుకు విమానంలో ఎక్కే ముందే ప్రయాణీకులందరినీ సరిగ్గా తనిఖీలు చేయాలని పలువురు యూజర్లు డిమాండ్ చేశారు.