SSST | మహారాష్ట్ర షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి భక్తులు బాబా దర్శనం కోసం వస్తుంటారు. ఈ క్రమంలో విలువైన కానుకలను సైతం సమర్పిస్తుంటారు. ఇప్పటికే ఎంతో మంది సాయిబాబాకు కానుకలను సమర్పించారు. తాజాగా ముంబయికి చెందిన భక్తుడు కిలో 400 గ్రాములకుపైగా బంగారంతో చేసిన పంచారతిని కానుకగా సమర్పించారు. ఈ విషయాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఆర్వో గోరక్ష్ గాడిల్కర్ పేర్కొన్నారు. ఈ పంచారతి విలువ రూ.కోటి వరకు ఉంటుందని తెలిపారు. భక్తుడు సమర్పించిన పంచారతిని మొదట బాబా పాదాల వద్ద ఉంచి.. ఆ తర్వాత సీఆర్వోకు అప్పగించారు. ఈ సందర్భంగా దాతను సంస్థాన్ ట్రస్ట్ ఘనంగా సన్మానించి.. జ్ఞాపికను అందజేశారు.