Indian Sailors : ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రవాణా నిలిచిపోయి, పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనేక నౌకలపై ఇరాన్ సైన్యం దాడి చేసింది. వాటిలో భారతీయ నౌకలున్నాయి. అలాగే, భారతీయులున్న ఇతర దేశాల నౌకలు కూడా ఉన్నాయి.
వాటిలో గత ఏప్రిల్‌లో భారతీయులున్న ఒక నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఒక భారీ వాణిజ్య నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా, అందులో 21 మంది భారతీయులున్నారు. ఈ నౌకపై ఇరాన్‌కు చెందిన సైన్యం అయిన ఐఆర్జీసీ (ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) దాడి చేసింది. చిన్న చిన్న బోట్లలో వచ్చిన ఐఆర్జీసీ సిబ్బంది.. నౌకలపై దాడికి పాల్పడ్డారు. ఇది భారతీయ సిబ్బంది ఉన్న పనామా నౌక. ఈ దాడి ఘటన గత ఏప్రిల్ 22న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని నౌకలోని సిబ్బంది వీడియో తీశారు.
On 22 April, in the Strait of Hormuz, a vessel carrying 22 crew members, of whom 21 were Indian, faced a deeply distressing situation.
These were not pirates.
They were naval forces of the IRGC.Videos show several small boats surrounding the vessel, the intensity of the… pic.twitter.com/5UgxtZETSd
— FSUI (@FSUIINDIA) August 20, 2026
దీనికి సంబంధించిన వీడియోను ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్యూఐ) సంస్థ విడుదల చేసింది. ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితి అని వ్యాఖ్యానించింది. ఇలాంటి సందర్భాల్లో జారీచేసే మార్గదర్శకాలు, సూచనలు నౌకలోని సిబ్బందిని రక్షించలేవని, నావికా దళాలు వారి భద్రతకు హామీ ఇవ్వాలని ఎఫ్ఎస్యూఐ వ్యాఖ్యానించింది. దాడి సమయంలో సిబ్బంది లోపల దాక్కున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ దాడి అనంతరం తాము రెండు విదేశీ నౌకల్ని దిగ్బంధించామని ఇరాన్ ప్రకటించింది.
గత ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ యుద్ధం ప్రారంభం కాగా.. అప్పటి నుంచి హార్ముజ్ జల సంధి వద్ద అనేక నౌకలపై ఇరాన్ దాడి చేసింది. కొన్నిసార్లు అమెరికా కూడా దాడికి పాల్పడింది. వాటిలో భారత నౌకలు కూడా దాడికి గురయ్యాయి. ఈ దాడుల్లో భారతీయులు సహా ఇతర దేశాల నౌకా సిబ్బంది కూడా మరణించారు.