షిల్లాంగ్: మేఘాలయా రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఫగూ చౌహాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటిదాకా మేఘాలయా గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఫగూ చౌహాన్‌ను నూతన గవర్నర్‌గా నియమించారు.
మేఘాలయా రాజ్‌భవన్‌లో శనివారం సాయంత్రం ఫగూ చౌహాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సత్యపాల్ మాలిక్ పదవీకాలం ముగిసినప్పటి నుంచి అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా మేఘాలయా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. కాగా, ఫగూ చౌహాన్ గతంలో బీహార్ గవర్నర్‌గా పనిచేశారు.