న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ఆంగ్లభాషపై విపరీతమైన పట్టు ఉన్న విషయం తెలిసిందే. ఆయన అనర్గళంగా ఆంగ్లపదాలను వాడగలరు. అంతేకాదు.. కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలను దేశ ప్రజలకు పరిచయం చేయడంలోనూ శశిథరూర్ దిట్ట. అయితే తాజాగా ఓ కొత్త పదాన్ని ఆయన ప్రయోగించారు. ఆ ఆంగ్ల పదంతో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ దాని అర్ధాన్ని ఆయన వివరించారు. పొగొనోట్రోఫీ (Pogonotrophy) అనే ఆంగ్ల పదాన్ని కొత్తగా నేర్చుకున్నట్లు ఎంపీ శశిథరూర్ తెలిపారు. పొగనోట్రోఫీ అంటే గడ్డాన్ని పెంచడం అన్నమాట. ఆ పదం అర్ధాన్ని తెలిపేందుకు ఆయన మోదీని ఉదాహరణగా తీసుకున్నారు. కరోనా వైరస్ సంక్షోభం మొదలైన తర్వాత ప్రధాని మోదీ గడ్డం పెంచుతున్న విషయం తెలిసిందే. గత ఏడాదిన్నర కాలం నుంచి మోదీ తెల్లగడ్డంతో దర్శనం ఇస్తున్నారు. పొగొనోట్రీఫీ అంటే మోదీలా గడ్డాన్ని సాగు చేయడమన్న ఉద్దేశాన్ని ఎంపీ శశిథరూర్ వినిపించారు. ఈ కొత్త పదాన్ని తన మిత్రుడు రితిన్ రాయ్ అనే ఆర్థికవేత్త నేర్పినట్లు ఆయన చెప్పారు.
My friend Rathin Roy, the economist, taught me a new word today: pogonotrophy, which means "the cultivation of a beard". As in, the PM's pogonotrophy has been a pandemic preoccupation… https://t.co/oytIvCKRJR
— Shashi Tharoor (@ShashiTharoor) July 1, 2021
ఇటీవల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు కూడా ఎంపీ శశిథరూర్ ఓ జలక్ ఇచ్చారు. కరోనా చికిత్స కోసం అందుబాటులో ఉన్న ఔషధాల పేర్లు పలకడంలో నాలుక తిరగడం లేదని, వీటికి ఎంపీ శశిథరూర్ మాత్రమే సమాధానం ఇవ్వగలరని మంత్రి కేటీఆర్ సరదగా ఓ ట్వీట్ చేశారు. దానికి బదులిస్తూ floccinaucinihilipilification అనే ఓ ఆంగ్ల పదంతో ఎంపీ శశిథరూర్ మంత్రి కేటీఆర్‌ను మరింత చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే.