ముంబై: శరద్‌పవారే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిక వర్గం నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్‌పవార్ వర్గం నాయకులు ముంబైలో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు సునీల్ తట్కరేను ఎన్నుకున్నట్లు సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు.
అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పటేల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు స్పందించారు. అందుకు ప్రఫుల్ పటేల్ కంటే ముందే అజిత్ పవార్ స్పందించారు. ‘మీరు మర్చిపోయారా..? మా పార్టీ జాతీయాధ్యక్షులు శరద్‌పవారే’ అని ఆయన చెప్పారు.