Today History: ఆగ్రాలో నిర్మించిన తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నంగా మనం భావిస్తుంటాం. ఈ నిర్మాణాన్ని చేపట్టిన ఖుర్రం 1592 లో సరిగ్గా ఇదే రోజున లాహోర్‌లో జన్మించారు. తండ్రి జహంగీర్ మరణం తర్వాత ఖుర్రం కాస్తా షాజహాన్‌గా మారి రాజ్యపాలన చేపట్టారు. తాత అక్బర్ వద్ద చిన్ననాటి నుంచే అన్ని విద్యల్లో ఆరితేరిన షాజహాన్.. తన ప్రియురాలు ముంతాజ్ జ్ఞాపకంగా యమునా నది ఒడ్డున తాజ్‌మహల్‌ను నిర్మించారు.
జహంగీర్ 1627లో మరణించాడు. అతడి మరణానంతరం 1628 లో ఖుర్రం సింహాసనాన్ని అధిష్టించాడు. సింహాసనాన్ని చేపట్టిన తర్వాత ఖుర్రాం తన పేరును ప్రపంచానికి రాజు అని అర్థం వచ్చేలా ‘షాజహాన్’ అని మార్చుకున్నాడు. షాజహాన్ తన రాజ్యాన్ని ఉత్తరాన కాందహార్ వరకు విస్తరించాడు. దక్షిణ భారతదేశంలోని చాలా భాగాన్ని స్వాధీనం పరుచుకున్నాడు. షాజహాన్ 30 సంవత్సరాల పాటు పాలన కొనసాగించాడు. 1607 లో 14 ఏండ్ల వయసున్న అర్జుమంద్ బానో అనే యువతితో పెండ్లి నిశ్చితార్థం చేసుకుని ఐదేండ్ల అనంతరం 1612 లో వివాహం చేసుకున్నాడు. అర్జుమంద్ బానోతో నిశ్చితార్థం-వివాహం మధ్య ఖుర్రం మరో ఇద్దర్ని పెండ్లి చేసుకున్నాడు.
షాజహాన్తో పెండ్లి తర్వాత అర్జుమంద్ బానో తన పేరును ముంతాజ్గా మార్చుకుంది. వీరికి 13 మంది పిల్లలు. 1631 లో 14 వ బిడ్డకు జన్మనిస్తూ ముంతాజ్ చనిపోయింది. ముంతాజ్‌ను ఎంతగానో ప్రేమించి షాజహాన్.. ఆమె చనిపోయిన రెండేండ్లకు అన్ని విలాసాలను వదులుకుని బైరాగిగా మారారు. ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను నిర్మించాడు. తాజ్‌మహల్ నిర్మాణం 22 ఏండ్ల పాటు కొనసాగాయి. తెలుపు రంగు తాజ్‌మహల్ వెనుక వైపున నలుపు తాజ్‌మహల్‌ను నిర్మించాలనుకుని.. తన కుమారుడు ఔరంగజేబుతో వివాదం కొనితెచ్చుకుని ఆ పనిని విరమించుకున్నాడు. చివరకు 1666 లో ఆగ్రాలోనే షాజహాన్ తుదిశ్వాస విడిచాడు.
2014: భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-14 విజయవంతంగా ప్రయోగం
2009: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
2003: అల్జీరియాలో తిరుగుబాటుదారుల దాడిలో 43 మంది సైనికులు మరణం
2000 : పీలేను సెంచరీ ప్లేయర్‌గా ప్రకటించిన ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్, స్టాటిస్టిక్స్ ఫెడరేషన్
1970: చైనా యునాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం, 15,000 మంది దుర్మరణం
1971: మెల్బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే ఇంటర్నేషనల్
1955: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జననం
1941: ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ జననం
1934: బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి జననం
చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? గుండెనొప్పా?
కళ్లు పొడిబారుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..