న్యూఢిల్లీ, అక్టోబర్ 2: మోస్ట్ వాంటెడ్ ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఫుణె పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడు ఢిల్లీలో రహస్య జీవనం సాగిస్తున్నాడు. అతడి తలపై రూ.3 లక్షల రివార్డు ఉన్నది.
వృత్తిరీత్య ఇంజినీర్ అయిన షానవాజ్ను ఆదివారం రాత్రి ఢిల్లీ ప్రత్యేక సెల్ పోలీసులు అరెస్టు చేశారు. షానవాజ్ వద్ద కొన్ని రసాయనాలు, పేలుడు పదార్థాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అతడితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.