బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో నవ దంపతులు మృతిచెందారు. వారితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో అయిదు మంది ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఓవర్ టేకింగ్ చేస్తున్న సమయంలో.. ఆటోను కారు ఢీకొన్నది. కారు ఢీకొన్న తర్వాత.. సమీపంలో ఉన్న విద్యుత్త స్తంభాన్ని ఆటో ఢీకొట్టింది. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్-నైనిటాల్ హైవేపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు.
కారు వేగంగా ఢీకొట్టడంతో.. ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. డ్రైవర్ అజాబ్ సింగ్ ను ఆస్పత్రిని తీసుకెళ్తుండగా అతను ప్రాణాలు కోల్పోయాడు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు పంపినట్లు ఎస్పీ అభిషేక్ తెలిపారు.