గువాహటి: ప్రముఖ బాలీవుడ్, అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి! సింగపూర్‌లోని ఓ ద్వీపం సమీపంలో సెప్టెంబరు 19న ఈత కొడుతూ ఆయన మరణించారు. ఈ కేసులో అస్సాం పోలీసులు జుబిన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్కను మహంత, మ్యూజిషియన్ అమృత్ప్రవ మహంత, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామిలను అరెస్ట్ చేశారు.
పోలీసులు శేఖర్‌ను ప్రశ్నించినపుడు, జుబిన్‌కు ఆయన మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్ విషం ఇచ్చారని ఆయన వెల్లడించారు. జుబిన్ మరణించడానికి ముందు శర్మ అనుమానాస్పదంగా ప్రవర్తించినట్లు చెప్పారు. జుబిన్ ఈత కొడుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారని, అప్పుడు శర్మ గట్టిగా అరుస్తూ, “అతన్ని వెళ్లనివ్వండి” అని చెప్పారని తెలిపారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగలు కక్కుతూ ఉంటే, ఏం పర్వాలేదని శర్మ అన్నారని చెప్పారు.తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నిందితులు విదేశీ స్థలాన్ని ఎంచుకున్నారని తెలిపారు.