మహిళా అధికారిపై ఐఏఎస్ ఆఫీసర్ అనుచిత వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్లో ‘మిషన్ యువ’ సమీక్షా సమావేశంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అక్టోబర్ 14న కార్మిక, ఉపాధి కల్పన శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఉన్న రంజన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశం
- రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ‘మిషన్ యువ’ సమీక్షా సమావేశంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అక్టోబర్ 14న కార్మిక, ఉపాధి కల్పన శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఉన్న రంజన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్మిక, ఉపాధి కల్పన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(కేఏఎస్) మహిళా అధికారి బీనిష్ వాణి ఈ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు. ఈ పథకం అమల్లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్(ఎన్ఆర్ఎంఎల్) పాత్రపై వారి మధ్య చర్చ మొదలైంది. ‘మీకు ఎన్ఆర్ఎంఎల్ ఎందుకు? మీ పనిని ఇతరులకు అప్పగిస్తున్నారు. వారు మీ సహాయకులే.. మీరే ప్రధాని అధికారి’ అని రంజన్ అన్నారు.
దీనికి వాణి సమాధానమిస్తూ, ‘సర్, ఎన్ఆర్ఎంఎల్లో వారి సహాయం అవసరం. మేము మా లక్ష్యాన్ని పూర్తి చేశాం’ అని అన్నారు. వెంటనే ఆగ్రహానికి గురైన రంజన్ ‘నోరు మూసుకో.. మాట్లాడకు’ అంటూ అరిచారు. దీంతో ఆమె ఏదో చెప్పబోగా ‘నాతో మాట్లాడటానికి ఎంత ధైర్యం? అని అంటూ రంజన్ ఆమెపై అనుచిత పదజాలం వాడారు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడంతో, మరో అధికారిని పిలిచి ఆమె సస్పెన్షన్ ఉత్తర్వును టైప్ చేయాలని ఆదేశించారు. దీనిపై వాణి స్పందిస్తూ ‘పర్వాలేదు. నన్ను సస్పెండ్ చేసుకోండి’ అని బదులిచ్చారు. దీంతో రంజన్ ‘గెట్ అవుట్, గెట్ అవుట్ అంటూ కేకలు వేశారు. ఆమె సమావేశం నుంచి నిష్క్రమిస్తూ ‘టు హెల్ విత్ యూ’ అని వ్యాఖ్యానించారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రంజన్ గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

