న్యూఢిల్లీ, మే 1 : అవినీతికి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేసిన ఐఏఎస్ అధికారిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన అశోక్ ఖేమ్కా ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ చేశారు. 34 ఏండ్ల తన సుదీర్ఘమైన కెరీర్లో ఎక్కడా.. ఎవరి వద్దా రాజీపడకుండా పనిచేసినందుకు ఆయనకు దక్కిన బహుమతి 57 సార్లు బదిలీ ఉత్తర్వులు. పదే పదే ట్రాన్స్ఫర్లతో ఆయన దేశం యావత్తు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి 6 నెలలకోసారి (సగటున) కొత్త పోస్టుకు అశోక్ ఖేమ్కాను బదిలీ చేశారు. ఆయన 1991 బ్యాచ్ హర్యానా క్యాడర్ అధికారి.