రాంచి, మే 24: న్యాయస్థానాల తీర్పులు యథాతథంగా అమలై ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, సీజేఐ చూడాలని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో బుధవారం కొత్త హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ కొన్నిసార్లు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆ సంతోషం ప్రజలకు ఉండటం లేదని, కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడమే కారణమని పేర్కొన్నారు. అన్ని భాషల్లోకి కోర్టు తీర్పులను అనువదించడం ద్వారా దేశంలోని 6.4 లక్షల గ్రామాల్లోకి న్యాయాన్ని తీసుకెళ్లగలమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.