BMW Crashes | బీఎమ్‌డబ్ల్యూ కారు బీభత్సం.. నలుగురికి గాయాలు
BMW Crashes | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో ఓ బీఎమ్‌డబ్ల్యూ కారు (BMW Car) బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకెళ్తూ ఆగి ఉన్న మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
BMW Crashes | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో ఓ బీఎమ్‌డబ్ల్యూ కారు (BMW Car) బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకెళ్తూ ఆగి ఉన్న మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఉన్నతస్థాయి గ్రేటర్ కైలాష్ 2 (Greater Kailash 2) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాత్రి సమయంలో గంటలకు 150 స్పీడ్‌తో దూసుకెళ్తున్న బీఎమ్‌డబ్ల్యూ కారు.. రోడ్డు పక్కన ఆగి ఉన్న సెడాన్ (Sedan) కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో సెడాన్ రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో సెడాన్‌లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 58 ఏళ్ల యశ్వంత్ నల్వాడే, 50 ఏళ్ల దేవరాజ్ మధుకర్, 62 ఏళ్ల మనోహర్, నితిన్‌గా గుర్తించారు. రాత్రి డిన్నర్ తర్వాత వారంతా వాకింగ్‌కు వచ్చినట్లు తెలిసింది. క్షతగాత్రులను వెంటనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ట్రామా సెంటర్‌కు తరలించారు. ఈ మేరకు ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చందన్ చౌదరి వెల్లడించారు.
Also Read..
Israel – Hamas War | ఆల్ షిఫా ఆసుపత్రిలో బందీలను దాచిన హమాస్.. వీడియో రిలీజ్ చేసిన ఐడీఎఫ్
Infosys | ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు.. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్‌పై కీలక ప్రకటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

