న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితికి చెందిన పీస్‌కీపింగ్ దళంలో కమాండర్‌గా చేస్తున్న భారతీయ ఆర్మీ ఆఫీసర్, బ్రిగేడియర్ అమితాబ్ జా(Amitabh Jha) ఇటీవల ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన మృతి పట్ల యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ నివాళి అర్పించారు. సంక్లిష్టమైన సిరియా-ఇజ్రాయిల్ సరిహద్దు సమీపంలో .. యూఎన్ పీస్‌కీపింగ్ ఫోర్స్‌కు అమితాబ్ జా నాయకత్వం వహించారు. యూఎన్ డిస్ఎంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్‌కు తాత్కాలిక కమాండర్‌గా చేశారాయన. అయితే ఆయన ఆకస్మికంగా మృతి చెందడం పట్ల సెక్రటరీ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Deeply saddened by the passing of Brigadier General Amitabh Jha of India, Deputy Force Commander of @UNDOF.
I met him several times and was inspired by his dedication and professionalism. I extend my heartfelt condolences to his family and to the Government of India. pic.twitter.com/PhR9jo0jVd— Jean-Pierre Lacroix (@Lacroix_UN) December 24, 2024
సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిన సమయంలో.. యూఎన్డీఓఎఫ్కు యాక్టింగ్ ఫోర్స్ కమాండర్‌గా అమితాబ్ చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో డిప్యూటీ ఫోర్స్ కమాండర్‌గా చేరారు. అయితే సిరియాలో సంక్షోభం ఏర్పడిన సమయంలో ఆ దళానికి ఆయన యాక్టింగ్ చీఫ్‌గా చేశారు. యూఎన్‌డీఓఎఫ్ దళాన్ని 1974లో ఏర్పాటు చేశారు. భద్రతా మండలి ఆధ్వర్యంలో ఆ దళం .. ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లో కాల్పుల విమరణ చేపట్టేలా చూసుకుంటుంది. యూఎన్‌డీఓఎఫ్ దళంలో 201 మంది భారతీయ సైనిక సిబ్బంది ఉన్నది. ఆ దళంలో వివిధ దేశాలకు చెందిన 1117 మంది సైనికులు ఉన్నారు.