లక్నో: ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలింది. దీంతో అదుపుతప్పిన ఆ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఆ రహదారిపై కారు ఆరుసార్లు పల్టీలు కొట్టింది. (Scorpio Flips 6 Times) అదృష్టవశాత్తు అందులో ప్రయాణించిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 6న ఢిల్లీ నుంచి బెగుసరాయ్‌కు వెళ్తున్న స్కార్పియో కారు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా ప్రయాణించింది. కాశీమాబాద్ ప్రాంతంలోని ఆ రహదారిలో కారు ముందు టైర్ పేలింది. అదుపుతప్పిన ఆ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు మధ్యలో ఆరుసార్లు పల్టీలుకొట్టింది. చివరకు డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
కాగా, ఆ కారులో ప్రయాణించిన నలుగురు పిల్లలతో సహా ఏడుగురు అదృష్టవశాత్తు ఈ యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ముఖేష్, రూపేష్, అతడి భార్య రంజనా, వారి నలుగురు పిల్లలు రితిక, రియా, రిద్ధి, రిషబ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
गाजीपुर: टायर फटने से स्कॉर्पियो डिवाइडर से टकराई
स्कॉर्पियो गेंद की तरह हवा में उछली
हादसा सीसीटीवी में हुआ कैद
स्कॉर्पियो मे सवार चार बच्चों सहित सात लोग हुए घायल
पूर्वांचल एक्सप्रेसवे पर 310 किमी पर हादसा
सभी दिल्ली से बिहार के बेगूसराय जा रहे थे#CCTV #RoadAccident pic.twitter.com/k1jyIIuQsm— Indian Observer (@ag_Journalist) February 8, 2025