‘If you can’t be mine…’: ‘నాకు దక్కకపోతే మరెవరికీ దక్కనీయను’.. నవ వధువు గొంతు కోసిన ప్రియుడు
If you can't be mine | ఒక యువతికి ఈ నెల 17న వివాహమైంది. దీనిపై ఆమె ప్రియుడు యాసిన్ ఆగ్రహం చెందాడు. మరో పెళ్లి వేడుకకు వెళ్తున్న ఆ నవ వధువుపై బ్లేడ్‌తో దాడి చేశాడు. ‘నువ్వు నాకు దక్కకపోతే, మరొకరికి దక్కనీయను’ అని హెచ్చరించి అక్కడి నుంచి పారిపోయాడు.
లక్నో: నవ వధువుపై ఆమె ప్రియుడు దాడి చేశాడు. బ్లేడ్‌తో ఆమె గొంతు కోశాడు. ఆమె తనకు దక్కకపోతే మరెవరికీ దక్కనీయనని హెచ్చరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక యువతికి ఈ నెల 17న వివాహమైంది. దీనిపై ఆమె ప్రియుడు యాసిన్ ఆగ్రహం చెందాడు. పెళ్లైన రెండు రోజుల తర్వాత ఈ నెల 19న మరో పెళ్లి వేడుకకు వెళ్తున్న ఆ నవ వధువుపై బ్లేడ్‌తో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా ఆమె గొంతు కోశాడు. ‘నువ్వు నాకు దక్కకపోతే, మరొకరికి దక్కనీయను’ అని హెచ్చరించి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ నవ వధువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె గొంతు భాగంలో లోతుగా గాయం కావడంతో పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఎలాంటి ఆహారం తీసుకోవద్దని ఆమెకు సూచించారు. మెజిస్ట్రేట్ ఎదుట ఆ మహిళ స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు యాసిన్ గురించి అతడి కుటుంబం, బంధువుల వద్ద ఆరా తీశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

