బెర్లిన్, అక్టోబర్ 12: ఉంగరానికి ఓ అదృశ్య శక్తి ఉండి, దాన్ని చూపించగానే దుష్ట శక్తులు పారిపోయే సన్నివేశాలను ఫిక్షన్ సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, నిజంగానే దోమలు, ఇతర కీటకాలను పారదోలే ఉంగరం ఉంటే! భలే ఉంటుంది కదా. జర్మనీకి చెందిన మార్టిన్ లూథర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 3డీ టెక్నాలజీతో ఇలాంటి ఉంగరాన్నే తయారుచేశారు. కీటకాలను తరిమికొట్టే రసాయనాన్ని పాలిమర్ (మట్టిలో కలిసిపోయేది)తో మిళితం చేసి 3డీ ఉంగరంగా రూపొందించారు. ఈ ఉంగరం దోమల నుంచి ఎక్కువసేపు రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.