న్యూఢిల్లీ : పంజాబ్‌లోని మొహాలీలో పార్కింగ్ వివాదం మంగళవారం ఓ సైంటిస్ట్ ప్రాణాలను బలి తీసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌లో పని చేసిన అభిషేక్ స్వర్నికర్ ఇటీవలే మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. డయాలసిస్ జరుగుతున్నది. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన దానిని బట్టి, ఓ బైక్ వద్ద కొందరు వ్యక్తులు నిల్చున్నారు. అభిషేక్ వారితో మాట్లాడి, ఆ బైక్‌ను అక్కడి నుంచి తొలగించారు. కొద్ది క్షణాల్లోనే పొరుగింట్లో ఉండే వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. అభిషేక్‌ను తోసేశాడు. ఆయన కింద పడిపోయారు. అతనిపై ఆ వ్యక్తి దాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. అభిషేక్ లేచి, నిల్చోలేక కుప్పకూలిపోయారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.