ఇండోర్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇండోర్‌లో నాలుగేళ్ల స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కేసులో వాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు ప్లేస్కూల్‌కు విద్యార్థుల్ని తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్‌పై ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా డ్రైవర్ సుమిత్‌ను అరెస్టు చేశారు. చిన్నారి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రైవర్ తన మర్మావయాలను తాకినట్లు తల్లికి చెప్పడంతో.. పేరెంట్స్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు. ప్లేస్కూల్ డ్రైవర్‌కు చెందిన వివరాలు సేకరించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 376(3), 354, 506 ఐపీసీ కింద అతన్ని బుక్ చేశారు. పోక్సో చట్టం కింద కూడా అతనిపై కేసు నమోదు చేశారు.