న్యూఢిల్లీ: సిన్చువాన్ ప్రావిన్సులో తన రహస్య స్థావరాల్లో చైనా జోరుగా అణ్వస్ర్తాలను తయారుచేస్తున్నది. చైనా అణ్వస్ర్తాలు వేగంగా పెరిగాయి. ప్రపంచంలోనే ఇప్పుడు చైనా మూడో అతిపెద్ద అణ్వస్త్ర దేశంగా ఎదిగింది. 2026 ప్రారంభం నాటికి చైనా వద్ద దాదాపు 600 అణుబాంబులు ఉన్నాయి. రష్యా వద్ద దాదాపు 5,400, అమెరికా వద్ద దాదాపు 5,10-5,200 అణు బాంబులు ఉండగా వాటి తర్వాత స్థానంలో చైనా ఉంది.
2023 నాటికి వెయ్యికి పైగా అణుబాంబులను తయారుచేయాలని చైనా భావిస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్కు సుమారు 800 కిలోమీటర్ల దూరంలోని సెన్చువాన్ ప్రావిన్సుకు చెందిన పర్వతాల్లో నిర్మించిన అణు స్థావరాల్లో విస్తరణ, ఆధునీకరణ విస్తృతంగా సాగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాలను న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.