అలప్పుజ: పేద కుటుంబాలను పాఠశాల విద్యార్థులు దత్తత తీసుకునే కార్యక్రమానికి కేరళలోని అలప్పుజలో శ్రీకారం చుట్టారు. జిల్లాలో 3,613 కుటుంబాలను అధికారులు గుర్తించారు. ఒక్కో పేద కుటుంబాన్ని ఒక్కో విద్యార్థుల బృందం దత్తత తీసుకుంటుంది. వీరికి కావాల్సిన ఆహారం, వస్తువులను పిల్లలు అందిస్తారు. సబ్బులు, పేస్టులు, పప్పులు, బియ్యం, ఇలా తోచిన వస్తువులు తీసుకువస్తారు.