మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 15:56:25

సీబీఎస్ఈ బోర్డు ప‌రీక్ష‌లు వాయిదా వ‌ద్దు..

సీబీఎస్ఈ బోర్డు ప‌రీక్ష‌లు వాయిదా వ‌ద్దు..

హైద‌రాబాద్‌: వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సీబీఎస్ఈ బోర్డు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌వ‌ద్దు అంటూ అనేక స్కూళ్ల ప్రిన్సిపాళ్లు అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.  దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు స‌మీప ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాయి.  కోవిడ్ వ‌ల్ల చాలా వ‌ర‌కు స్కూళ్ల‌ను మూసివేశారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది జ‌రిగే బోర్డు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌రాదు అని ప్రిన్సిపాల్స్ కోరినట్లు తెలుస్తోంది.  బోర్డు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తే,  ఉన్న‌త విద్య షెడ్యూల్ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని, ఎంట్రెన్స్ ప‌రీక్ష‌లు, అడ్మిష‌న్ ప్ర‌క్రియ దెబ్బ‌తింటుంద‌ని ప్రిన్సిపాల్స్ అభిప్రాయ‌ప‌డ్డారు.  వ‌చ్చే ఏడాది మే నెల క‌న్నా ముందే బోర్డు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌రాదు అని సీబీఎస్ఈని ఢిల్లీ ప్ర‌భుత్వం కోరింది.  పాఠ్యాంశాల‌ను కూడా త‌గ్గించాలంటూ సీబీఎస్ఈ బోర్డును ఆ ప్ర‌భుత్వం అభ్య‌ర్థించింది.  

ఎయిమ్స్ డైర‌క్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా.. క‌రోనా వైర‌స్‌పై పుస్త‌కాన్ని ర‌చించారు.  టిల్ వి విన్ టైటిల్ ఉన్న ఆ పుస్త‌కాన్ని ఈ నెల‌లో రిలీజ్ చేయ‌నున్నారు.  కోవిడ్ నివార‌ణ‌లో భార‌త్ చేసిన పోరాటంపై ఆ పుస్త‌కంలో వివ‌రించ‌నున్నారు.  రానున్న రోజుల్లో మ‌హ‌మ్మారిని ఎలా ఎదుర్కోవాలో దాంట్లో చెప్పారు. పెన్‌గ్విన్ ర్యాండ‌మ్ హౌజ్ ఆ పుస్త‌కాన్ని ప్ర‌చురిస్తోంది. ఆరోగ్య నిపుణుడు చంద్ర‌కాంత్ ల‌హ‌రియా  కూడా ఈ పుస్త‌కంలో త‌న అనుభవాలు పంచుకున్నారు.