Schools reopen | కొత్తగా స్కూల్ బబుల్ ప్రతిపాదన.. అసలు ఏంటది?

Schools reopen | కరోనా పుణ్యమా అని ఏడాదిన్నర కాలంగా బడుల్లేవు. పిల్లలు కొత్తగా నేర్చుకోవడం సంగతి అటుంచితే ఉన్నది మర్చిపోతున్నారు. బడులు తెరవడం ( Schools reopen ) ఇంకా ఆలస్యమైతే వాళ్లు ఎంతో నష్టపోతారని విద్యా నిపుణులు, మానసిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపాలంటే భయపడుతున్నారు. ఆన్లైన్లో విద్యాబోధన ఫలితాలు అంతగా బాగా లేవని సర్వేలు చెప్తున్నాయి. తమకు ఏం అర్థం కావడం లేదని పిల్లలు చెప్తున్నారు. మరోవైపు, అందరికీ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవటం మరో సమస్య. ఈ నేపథ్యంలో బడులు తెరువక తప్పని పరిస్థితి… తెరిస్తే ఏం అవుతుందో ఏమో అన్న భయం.. ఈ పరిస్థితుల్లో ‘స్కూల్ బబుల్ ( School bubble ) ప్రతిపాదన ముందుకు వస్తున్నది.

స్కూల్ బబుల్ ( School bubble ) అంటే
సాధారణంగా బడుల్లో పిల్లలు ఒకరినొకరు కలవకుండా ఆపడం కష్టం. అందుకే పిల్లలను కొన్ని చిన్న చిన్న గ్రూపులుగా విభజిస్తారు. సాధారణంగా ఒకే తరగతి/ఒకే ప్రాంతానికి చెందిన.. ఇలా ఎక్కువగా కలిసే అవకాశం ఉన్న పిల్లలను గుర్తించి ఈ గ్రూపులను చేస్తారు. ఒక్కో గ్రూపునకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తారు. రెసిడెన్షియల్ బడుల్లోనైతే ఒక్కో గ్రూపు వేర్వేరుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో గ్రూపును స్కూల్ బబుల్ అంటారు.

బ్రిటన్‌లో సక్సెస్
స్కూల్ బబుల్ విధానం యూకేలో విజయం సాధించింది. కరోనా వ్యాప్తిపై కర్ణాటక సర్కారు ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా కమిటీ కూడా స్కూల్ బబుల్ ప్రతిపాదన చేసింది. బడుల్లో స్కూల్ బబుల్స్ ఏర్పాటు చేసి విద్యాబోధన జరుపాలని సూచించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలని యోచిస్తున్నది. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది.

బడి మొత్తాన్ని మూసేయకుండా..
స్కూల్ బబుల్‌లో ఉన్న పిల్లలు కలిసి ఆడుకొంటారు. చదువుకొంటారు. సాధారణ పరిస్థితుల్లో ఉన్నట్టే ఉంటారు. దాంతో మళ్లీ మామూలు పరిస్థితులకు అలవాటు పడతారు. అదే సమయంలో పిల్లలు బయట తిరగడం తగ్గడం వల్ల వారికి వైరస్ ముప్పు తగ్గుతుంది. ఒకవేళ ఒక గ్రూపులో ఎవరికైనా వైరస్ సోకితే బడి మొత్తాన్ని మూసేయాల్సిన అవసరం రాదు. ఈ గ్రూప్‌లో అందరికీ పరీక్షలు చేసి ఐసోలేషన్ చేస్తే సరిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Schools Reopen | స్కూల్ బస్సుల్లో ఈ నిబంధనలు పాటించాల్సిందే.. లేదంటే..
Schools Reopen | బడుల్లో పిల్లల భద్రత ఎలా? టీచర్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ రియాక్షన్ ఏంటి?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

