Schools Reopen | బడుల్లో పిల్లల భద్రత ఎలా? టీచర్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ రియాక్షన్ ఏంటి?
Schools Reopen | ఆన్లైన్ తరగతులతో కొంతవరకు సత్ఫలితాలు వచ్చినా ఆ విధానాన్ని కొనసాగించడం అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులకు కష్టంగా మారింది.

Schools Reopen | గత విద్యా సంవత్సరాన్ని కొవిడ్ చిన్నాభిన్నం చేసింది. కనీసం ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయని అనుకుంటే సెకండ్ వేవ్ మూడు నెలల పాటు విద్యార్థులకు విద్యను దూరం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హితవు పలికింది. దీంతో విద్యాసంస్థలు కొవిడ్ జాగ్రత్తలపై దృష్టిసారించాయి.

ఆన్లైన్ తరగతులతో కొంతవరకు సత్ఫలితాలు వచ్చినా ఆ విధానాన్ని కొనసాగించడం అటు విద్యాసంస్థలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు కష్టంగా మారింది. తాజాగా ప్రభుత్వం విద్యాసంస్థలను తెరుచుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల ఆరోగాన్ని కాపాడుతూనే బోధన సాగించేందుకు సంసిద్ధమవుతున్నాయి.

కొవిడ్ నిబంధనలు తప్పనిసరి..!

- సెప్టెంబర్ 1 నుంచి బడులు, కాలేజీలు ప్రారంభం కానుండటంతో ఇప్పటికే విద్యాసంస్థల యాజమాన్యాలు సమావేశమవుతున్నాయి. ప్రభుత్వ సూచనలపై సమాలోచనలు మార్చుకోవాలని భావిస్తున్నాయి.
- విద్యార్థుల మధ్య భౌతిక దూరం పెంచేందుకు వీలుగా తరగతులను ఏ,బీ,సీ సెక్షన్లుగా విభజించే ఆలోచన చేస్తున్నాయి.
- ప్రతి విద్యార్థి శానిటైజర్‌తో పాటు మాస్క్ ధరించడం కఠినంగా అమలు చేయనున్నాయి.
- క్లాస్ అయిపోగానే బెల్ మోగినట్లు.. శానిటైజర్, మాస్క్‌కు సంబంధించి అలర్ట్‌లు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాయి.
- విద్యాసంస్థల్లో థర్మల్ స్క్రీనింగ్, ఆటోమేటెడ్ ఎంట్రీగేట్, టెంపరేచర్ చెక్ చేసే ఆధునిక పరికరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి.
- ప్రతి రోజు ప్రతి క్లాస్‌ను శానిటైజ్ చేసేలా జాగ్రత్తలు తీసుకోనున్నాయి.
- విద్యా సంస్థల్లో కనీసం రెండు ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వైద్యాధికారులు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తారు.

సంతోషంగా ఉంది..
విలువైన కాలేజీ లైఫ్ ఇంట్లోనే ముగుస్తుందా అని భయపడ్డా. స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆన్లైన్లో చదువులు సాగుతున్నా స్నేహితులు లేరనే బాధ మాత్రం ఉంది. మా లెక్చరర్లతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. సెప్టెంబర్ 1 నుంచి కాలేజీ వెళ్తా. భద్రంగా ఉంటూ విద్యను అభ్యసిస్తా.
-విజ్నశ్రీ, విద్యార్థి

పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు..
ఇంట్లోనే పిల్లలు ఎక్కువ రోజులు ఉండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. టీచర్లు, స్నేహితులను కలిసే అవకాశం లేకపోవడంతో వారి మానసిక ఎదుగుదలకు కొంత నష్టం కలుగుతుంది. పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయం. ఈ విషయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. విద్యాసంస్థలు తెరిస్తే విద్యార్థులకు కొంత లాభం కలుగుతుంది.
– నిర్మల, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

బడే బెటర్..
ఆన్లైన్ చదువులతో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. యూట్యూబ్‌లో పాఠాలు వినిడం మేలు అనిపిస్తున్నది. టీచర్లు చెప్పే అనేక విషయాలు పిల్లలకు అర్థం కావడం లేదు. ఈ సంవత్సరం మూడు నెలలు బడులు తెరవలేదు. స్కూళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అభినందనీయం. బడిలోనే అనేక విషయాలు నేర్చుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతారనడంలో సంశయం లేదు.
– పల్లవి

జాగ్రత్తలను బట్టి ఆలోచిస్తాం..
థర్డ్‌వేవ్ ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడం కొంత ఇబ్బందికరమే. పిల్లల చదువుతో పాటు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం ప్రస్తుతం అత్యవసరం. ఆన్లైన్ చదువులతో ఉపయోగం లేకున్నా.. ప్రత్యక్ష విద్యాబోధన కోసం పాఠశాలలకు పంపాలంటే ఆలోచించాల్సి వస్తుంది. విద్యాసంస్థలు తీసుకునే జాగ్రత్తలను బట్టి పిల్లలను స్కూల్‌కు పంపాలా వద్దా నిర్ణయించుకుంటా.
– చంద్రవదన

ప్రత్యక్ష తరగతులే ఉత్తమం..
పిల్లలు ఇంట్లో ఏం చదువుతున్నారో పర్యవేక్షించలేకపోతున్నాం. వారి సందేహాలు నివృత్తి చేయడం కొంత కష్టమే. నెట్వర్క్, విద్యుత్, డేటా సమస్యతో క్లాసులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. చాలా మంది విద్యార్థులు క్లాస్ సమయానికి వీడియో ఆన్ చేయడం లేదు. వారు ఏం చేస్తున్నారో కూడా లెక్చరర్లు పర్యవేక్షించలేకపోతున్నారు. ఆన్లైన్లో రాసే పరీక్షల ఆధారంగా వచ్చే మార్కులతో విద్యార్థులు బాగా చదువుతున్నారని అనుకోలేము. తరగతి గదిలోనే ప్రత్యక్షంగా పాఠాలను వినడమే విద్యార్థులకు ఉత్తమం.
– అపర్ణ, చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్

మంచి నిర్ణయం..
చాలా రోజులుగా పిల్లలు ఇంట్లోనే ఉంటుండటంతో బయటి సమాజంపై అవగాహన ఉండటం లేదు. స్కూల్లో టీచర్లు, స్నేహితులను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు. జ్ఞానాన్ని పెంచుకుంటారు. వచ్చే నెల 1 నుంచి స్కూళ్లను తెరవడం మంచి నిర్ణయమే. ప్రతి పాఠశాల యాజమాన్యం కొవిడ్ నిబంధనలను పాటించాలి.
– స్నేహలత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

